బిగ్ బాస్ 3 యాంకర్ గా సీనియర్ హీరో… పార్టీసిపెంట్స్ ఎవరో తెలుసా?

163
Bigboss3

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిందో చెప్పనక్కర్లేదు. తెలుగులో సక్సెస్ పుల్ గా రెండు ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈషో తర్వలోనే మూడో షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మొదట చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున పేర్లు వినిపించాయి. తాజాగా ఉన్న సమాచారం మేరకు బిగ్ బాస్ 3 యాంకర్ గా నాగార్జున పేరు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. మీలో ఎవరూ కోటిశ్వరుడు షో చేసిన అనుభం ఉండటంతో ఆయన వైపే మొగ్గు చూపుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇదే విషయాన్ని గత సీజన్‌లో పాల్గొన్న సామ్రాట్‌.. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ట‌. మ‌రో వైపు బిగ్ బాస్ 3లో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా జ‌రుగుతుంది. జులై లేదా ఆగస్ట్ మొదటి వ