మరోసారి జోడిగా చై సామ్..

223
chai sam
- Advertisement -

అక్కినేని నాగచైతన్య సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ ఈచిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటివలే విడుదలైన ఈచిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం మరోసారి చైతన్య సమంత కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

గతంలో వీరిద్దరూ కలిసి ఏమాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఒక్క ఆటో నగర్ సూర్య సినిమా తప్ప మిగతా సినిమాలన్ని విజయం సాధించాయి. ఇప్పటికే నాలుగు సినిమాల్లో కలిసి నటించిన చై సామ్ ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నారని తెలుస్తుంది.

ఇందుకు సంబంధించి ఓ దర్శకుడు స్టోరీని సిద్దం చేశాడని సమాచారం. ఆ దర్శకుడు ఇటివలే ఆ కథను సమంత నాగచైతన్యకు వినిపించాడట. లైన్ నచ్చడంతో వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈఏడాదిలోనే ఈసినిమా కూడా పట్టాలెక్కనుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. చూడాలి మరి ఈవార్తలపై సమంత, నాగచైతన్య ఏవిధంగా స్పందిస్తారో..

- Advertisement -