ఉపాసన తమ్ముడితో అఖిల్ మాజీ లవర్ ఎంగేజ్‌మెంట్

219
Akhil's Ex-Girlfriend Ready For Wedding
- Advertisement -

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. 2016లో వీరి ప్రేమ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తర్వాత ఎంగేజ్‌మెంట్,కొన్నికారణాల వల్ల పెళ్లి పీటలు ఎక్కకముందే వీరిద్దిరు విడిపోయారు.

తర్వాత అఖిల్ తన దృష్టిని సినిమాలపై పెట్టగా….శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి సిద్ధమైంది. అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి. రెడ్డి మనువడు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు అనిందిత్ రెడ్డితో శ్రీయా నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు.

Akhil's Ex-Girlfriend Ready For Weddingఅనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు. అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.

- Advertisement -