సంతన్న గ్రీన్ ఛాలెంజ్..మొక్క నాటిన అఖిల్

228
Akhil Akkineni

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన ఛాలెంజ్ కు అపూర్వమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మరో ఇద్దరికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. అందులో వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్స్ అధినేత, అఖిల్ అక్కినేని.

తాజాగా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు హీరో అఖిల్ అక్కినేని. తన ఇంట్లో ఒక మొక్కను నాటి ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. పచ్చదనం పెంచే గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల్ తన గ్రీన్ ఛాలెంజ్ ను మరో ఇద్దరికి ట్యాగ్ చేశారు. తన సోదరుడు నాగచైతన్య, మెగా హీరో వరుణ్ తేజ్ కు గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.