సమ్మర్‌లో ‘రొమాంటిక్’గా వస్తున్న ఆకాష్ పూరి..!

589
Romantic
- Advertisement -

‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరి కి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రచార వ్యూహాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన శైలిలో అనౌన్స్ చేశారు.

మే 29న ప్రపంచవ్యాప్తంగా ‘రొమాంటిక్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా అలాంటి కాలక్షేపాన్ని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Romantic release date

రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు పాటలూ సంగీత ప్రియులను అలరిస్తూ చార్ట్ బస్టర్స్‌గా పేరు తెచ్చుకున్నాయి.

నరేష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.’ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Romantic still

- Advertisement -