ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గోన్న బాలీవుడ్ హీరో

364
ajay devgan
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించననున్నారు. హలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సముద్రఖని, రే స్టీవెన్‌సన్, ఎలిసన్ డూడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఈమూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా అజయ్ దేవగణ్ నేటి నుంచి ఈమూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. అజయ్, రాజమౌళితో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటివలే విశాఖ అడవుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతమైన వికారాబాద్ అడవుల్లో చిత్రకరణ జరుపుకుంటుంది. 2020 జూలై 30న పది భాషల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

- Advertisement -