ఆర్ఆర్ఆర్…ఫ్యాన్స్‌కి పండగే..!

544
ram charan
- Advertisement -

రాజ‌మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. సినిమా ప్రారంభం అయిన దగ్గరి నుంచి రోజుకో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు.

ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర వార్తలను వెల్లడించారు నటుడు శేఖర్. ఆర్ఆర్ఆర్ తారక్ ఫ్యాన్స్‌కి పండగేనని చెప్పారు. ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని… ఎన్టీఆర్‌ని సినిమాలో రెండు మూడు గెటప్స్‌లో చూశాను. ఒక్కో గెటప్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంటారని చెప్పారు. చరణ్‌తో ఒక్క సన్నివేశంలో నటించే ఛాన్స్ దక్కిందన్నారు.

ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆర్ఆర్ఆర్ సెట్స్‌లో అడుగుపెట్టగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రపంచంలోకి స్వాగతం అంటూ ఎన్టీఆర్,రాంచరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ సరసన శ్రియా నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -