ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..రూ.179తో జీవిత బీమా

168
airtel

ఎయిర్ టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఆసంస్ధ యాజమాన్యం. జీయోను తట్టుకోవడానికి మరో ప్లాన్ ను అమలు చేసింది ఎయిర్ టెల్. తాజాగా ఎయిర్ టెల్ రూ.179 ప్లాన్ తో జీవిత బీమా సౌకర్యం అందిస్తోంది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను నేడు ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. 18-54 వయస్సు కలిగిన వారికి జీవిత బీమా వర్తిస్తుంది.

ఇందుకోసం ఎలాంటి పత్రాలు గానీ, వైద్య పరీక్షలు గానీ అవసరం లేదని ఎయిర్‌టెల్‌ తెలిపింది. బీమాకు సంబంధించిన పాలసీ పత్రాలను తక్షణమే డిజిటల్‌ రూపంలో పంపిస్తామని, అవసరమైతే కాగితం రూపంలోనూ అందిస్తామని పేర్కొంది. జీవిత బీమాతో కూడిన ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లకు అనూహ్య స్పందన వస్తోందన్నారు కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శశ్వంత్‌ శర్మ. ఈ ప్లాన్ తో అయిన ఎయిర్ టెల్ కు వినియోగదారులు పెరుగుతారో లేదో చూడాలి మరి.