ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..

588
airtel
- Advertisement -

ప్రముఖ టెలికాం రంగ సంస్ధ జియో ధాటికి మిగతా సంస్ధలు కుదేలయిన సంగతి తెలిసిందే. జియో స్పీడును తట్టుకొలేక కొన్ని సంస్ధలు కాల్ ఛార్జీలను పెంచేశాయి. ఇటివలే ఐడియా, వొడాఫోన్, ఎయిర్ టెల్ సంస్ధలు కాల్ ఛార్జ్ లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ కొత్త ప్లాన్లను సవరించాయి. అన్‌లిమిటెడ్ ప్లాన్లను కొనుగోలు చేసినవారికి అపరిమిత ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్ అందుబాటులోకి వస్తాయి. ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ ఔట్‌గోయింగ్ కాల్స్ సదుపాయం ఉంటుంది.

శనివారం నుంచే ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించగా, ఎలాంటి షరతులు ఉండవని స్పష్టం చేసింది. ఇటీవల ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను 43 నుంచి 50 శాతం వరకూ పెంచిన ఎయిర్ టెల్, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ పై 12 వేల నిమిషాల ఇతర నెట్ వర్క్ ల ఔట్ గోయింగ్ కాల్స్ పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. ఆపై చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలవుతాయని కూడా ప్రకటించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, దిగొచ్చిన సంస్థ ఎయిర్ టెల్ నుంచి, ఏ ఇతర నెట్ వర్క్ కు అయినా, గతంలో మాదిరిగానే అపరిమితంగా మాట్లాడుకోవచ్చని, ఎటువంటి అదనపు రుసుములు ఉండవని స్పష్టం చేసింది. ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లకు కాల్స్, డేటా చార్జీలను 50 శాతం వరకు పెంచుతున్నట్లు ఈ నెల 1న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -