అజ్ఞాతవాసి ట్రైలర్..

242
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి ట్రైలర్ ఎట్టకేలకు వచ్చింది. గత సాయంత్రం నుంచి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఎదురు చూసేలా చేసిన నిర్మాతలు ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత ట్రైలర్‌ ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే… “ఇది మనం కూర్చునే కుర్చీ… పచ్చటి చెట్టును గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడును బ్లేడుతో సానబెట్టి, ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగుందో కదా?…జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకా ఓ మినీ యుద్ధమే దాగుంది” అంటూ ఈ ట్రయిలర్ తాజాగా విడుదల కాగా, నెట్టింట దూసుకెళుతోంది. ఒక నిమిషం 35 సెకన్ల నిడివి వున్న ఈ ట్రయిలర్ లో “వయొలెన్స్ ఈజ్ నాట్ ఏన్ ఆప్షన్” అన్న తొలి డైలాగుతో పాటు, “కౌగిలించుకోలేదండీ… జస్ట్ పట్టుకున్నామంతే” అన్న పవన్ మరో డైలాగ్, ఆయన ఇంట్లోనే సైకిల్ తొక్కుతున్న దృశ్యాలు, ఓ ఫైట్ బిట్, కార్ చేజింగ్ సీన్ ఉన్నాయి.

 agnathavasi trailler released

“మళ్లీ సైకిలెక్కుతాడా వర్మా?” అని మురళీ వర్మ ప్రశ్నించగా, “వాడు ఏదెక్కినా పర్లేదుగానీ మనల్ని ఎక్కకుంటే చాలు” అన్న రావు రమేష్ డైలాగ్ “వీడి చర్యలు ఊహాతీతం వర్మా… దట్స్ బ్యూటీ” అన్న డైలాగులు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ ట్రయిలర్ ను మీరూ చూడండి.

- Advertisement -