సోషల్‌ మీడియాలో కొత్త సెన్సేషన్‌…

288
Online News Portal
After Pakistani 'Chaiwalla,' Nepali 'Tarkariwali' Has Twitter's Attention
- Advertisement -

పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ ఖాన్ అనే నీలికళ్ల చాయ్‌వాలా ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం ఛాయ్ కొట్టు మూసేసి మోడల్స్‌తో ర్యాంపు వాకులు చేస్తున్నాడు. ఇపుడు సోషల్ మీడియాకి మరో అమ్మాయి చిక్కింది. ఈ కొత్త సెన్సేషన్‌ ‘చాయ్‌వాలా’ను పక్కకు తోసేసి.. ఇప్పుడు నేపాలీ తర్కారివాలీ (కూరగాయలు అమ్మే మగువ) నెటిజన్ల హృదయాలను ఉర్రూతలూగిస్తోంది.

ఇస్లామాబాద్‌లో ఓ మారుమూల ప్రాంతంలో చాయ్‌ అమ్ముకునే ఆర్షద్‌ ఖాన్‌ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాకు ఎక్కడంతో.. ఛాయ్‌వాలా ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారాడు. పాక్‌ ‘అణుబాంబు’ ఇతడేనంటూ.. కళ్లతోనే అమ్మాయిలపై సర్జీకల్ దాడులు చేస్తారంటూ అతని ఫొటోలు ఆన్‌లైన్‌లో బాగా హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు అదేవిధంగా కూరగాయాలు అమ్మే ఓ నేపాలీ అమ్మాయి ఫొటోలు సోషల్‌ మీడియా హార్ట్‌బీట్‌గా మారిపోయాయి. చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న ఆమె ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తర్కారివాలీ (#Tarkariwali) హ్యాష్‌ట్యాగ్‌తో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

ఈ నేపాలీ అమ్మాయి ఎలా సోషల్‌ మీడియాలోకి వచ్చిందంటే.. రూపచంద్ర మహాజన్‌ అనే నెటిజన్ ‘తర్కారివాలీ’ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది లైకులు.. కామెంట్లు.. షేర్లతో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె రూపానికి నీరాజనాలు పడుతూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైతే ఆమెకు సంబంధించిన విషయాలు భయటకు రాలేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రపంచం ఆమె గురించి ఎలాంటి కామెంట్లు పెడుతున్నారో మీరు చూడండి…

nepali girl

- Advertisement -