ఐపీఎల్‎లో అందరి కంటే చిన్నోడు .. ఇతడే..

254
Cricker Mujeeb,
- Advertisement -

ఐపీఎల్ ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా అఫ్గనిస్థాన్ యువ సంచలనం ముజీబ్ ఉర్ రహమాన్ రికార్డు సృష్టించాడు. మొహలీలో ఢీల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన ముజీబ్ వయస్సు 17 ఏళ్ల 11 రోజులుఅంతకుముందు భారత క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్(17ఏళ్ల 177 రోజులు), ప్రదీప్ సాంగ్వాన్(17ఏళ్ల 179 రోజులు) ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన యువ క్రికెటర్లుగా చరిత్ర సృష్టించారు. అయితే ముజీబ్ వయసు 17ఏళ్ల 11 రోజులు. దీంతో చిన్న వయసులో ఐపీఎల్ ఆడుతున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇదిలే ఉంటే ముజీబ్ కు భారీ మొత్తమే వెచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ ప్రదర్శన చేసిన యువ స్పిన్నర్ ముజీబ్‌ను ఐపీఎల్-2018 వేలంలో అత్యధికంగా రూ.4కోట్లు వెచ్చించి పంజాబ్ కొనుగోలు చేసింది. అఫ్గాన్ తరఫున 15 వన్డేలు ఆడిన రహమాన్ సరాసరి 16.62 సగటుతో 35 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ స్టార్ విదేశీ క్రికెటర్లతో పోటీపడి మరీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

- Advertisement -