థాకరే కుటుంబం నుంచి తొలి వ్యక్తి… ఆదిత్య రికార్డ్

868
aditya Takre
- Advertisement -

మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజేపీ, శివసేన కూటమి దూసుకుపోతుంది. ఎన్జీఏ కూటమి 168 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల 98 స్థానాల్లో ముందుంజలో ఉన్నారు. అయితే.. బీజేపీ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. శివసేన అభ్యర్థులు 67 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో మొదటగా ధాకరే కుటుంబం నుంచి యువ సేన ఛీప్ ఆదిత్య ధాకరే పోటీ చేశారు.

ముంబైలోని వర్లి నియోజకవర్గం ఆయన బరిలో ఉన్నారు. ఆదిత్య థాకరే  భారీ మెజార్టీతో విజయం సాధించారు  థాక‌రే కుటుంబం నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న మొద‌టి వ్య‌క్తి ఈయ‌నే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఆదిత్య‌కు పోటీగా ఎన్సీపీ పార్టీకి చెందిన సురేశ్ మానే పోటీ చేశారు. శివసేనకు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో సీఎం పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -