ఆసక్తిరేపుతున్న ‘ఆదిత్యవర్మ’ ట్రైల‌ర్..

327
Adithya Varma

తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీతో పాటు త‌మిళంలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేశ్ మెహతా నిర్మించిన ఈ సినిమాలో బనిత సంధు,ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్న చెన్నైలో ఈ చిత్ర ఆడియో వేడుక జరిగింది. ర‌ధ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

vikram

 

ఈ వేడుకలో నిర్మాత ముఖేశ్ మెహతా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తమ బ్యానర్‌లో విక్రమ్ ఆయన తనయుడు ధృవ్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ మూవీ ఉంటుందనీ, 2021- 22 మధ్య ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పారు. దాంతో విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Adithya Varma Movie

ఇక తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ధృవ్‌కి తొలి చిత్రం అయిన‌ప్ప‌టికి వివిధ స‌న్నివేశాల‌లో అద్భుతంగా న‌ట ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చాడు. ప్రేమ‌లో ఫెయిల్ అయిన వ్య‌క్తిగా ధృవ్ ప‌ర్‌ఫార్మెన్స్ సూప‌ర్భ్ అని చెప్పాలి. ధృవ్ ఫస్టు మూవీగా వస్తోన్న ‘ఆదిత్య వర్మ’ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు.