మానవాళి మనుగడకు చెట్లు జీవనాధారం..

304
green challeng
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం అభినందనీయమని అదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సోమవారం ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమోయి కుమార్ తనకు ఇటీవలే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారని, ఈరోజు మొక్కలు నాటి ఛాలెంజ్‌ను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి గొలుసుకట్టుగా మొక్కలు నాటడం. తద్వారా మరో ముగ్గురికి ఛాలెంజ్ చేయడం లాంటి అద్భుతమైన ప్రణాళిక కొనసాగుతుందని ఎస్పీ అన్నారు.

Adilabad SP

చెట్లు మానవాళి మనుగడకు జీవనాధారం, అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. చెట్లను పెంచడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించుకోవడం అంతకంటే ముఖ్యమని ఆయన తెలియజేశారు. మొక్కలు పెంపకంతోనే అదిలాబాద్ జిల్లాకు పూర్వవైభవం వస్తుందన్నారు, జిల్లాలో అడవులను రక్షించడానికి, అటవీ అధికారులతో కలిసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అభినందనియమని ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ శ్రీవాత్సవ, డిఎస్పి లు ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, సయ్యద్ సుజా ఉద్దీన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు ఓ సుధాకర్ రావు, కమతం ఇంద్ర వర్ధన్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సీ సుబ్బారావు, ఎస్సై అన్వర్ ఉల్ హక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -