మొక్కలు నాటిన అదిలాబాద్‌ IFS..

334
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన అదిలాబాద్‌ ఐఎఫ్ఎస్‌, డీఎఫ్‌ఓ డా.బి.ప్రభాకర్‌ మావల అర్బన్‌ పార్క్‌,అదిలాబద్‌లో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా డా.బి.ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి దీని ద్వారా కొన్ని కోట్ల మొక్కలు నాటే విధంగా ఎంతో మందిని ఇందులో భాగస్వామిని చేస్తూ ఇంత విజయవంతం కావడానికి కారణమైన ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదములు తెలిపారు.

prbhakar dfo

వృక్షో రక్షతిః వృక్షాలను మనం కాపాడితే అవి మనలను కాపాడుతాయి. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది అన్నారు. ఇంత మంచి కార్యక్రమంతో సంతోష్ కుమార్ భావితరాలకు మార్గదర్శకులుగా మారారు అన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలి అన్నారు. మొక్కలు నాటడం కాదు, అవి పెరిగి పెద్ద అయ్యేలా చూడాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు.1.సతాన్‌,ఐఎఫ్‌ఎస్‌,డిఎఫ్‌ఓ,నిర్మల్‌. 2.టీ రాజేంద్ర కుమార్‌, అసిస్టెంట్‌ కమీషనర్‌,జీఎస్‌టీ,హైదరాబాద్‌.3.కే గంగా కిషోర్‌,జిల్లా సైన్స్‌ అధికారి,డిఎఫ్‌ఓ ఆఫీస్‌,నిజామాబాద్‌. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో సేవ్ ట్రీస్ ఫౌండర్ విక్రాంత్ గారు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -