పెళ్లి కూతురు కానున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!

687
Archana marrage
- Advertisement -

టాలీవుడ్‌ నటి అర్చన ప్రముఖ వ్యాపార వేత్త జగదీశ్‌ను పెళ్లి చేసుబోతున్న సంగతి తెలిసిందే.. అక్టోబర్ 3 న వీరికి నిచ్చితార్ధం కాగా ఆమె నిచ్చితార్ధం కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 13 న వీరి పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

archana

అర్చన తెలుగులో శ్రీరామదాసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సామాన్యుడు తదితర చిత్రాల్లో మెరిసింది. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో కూడా ఈ అమ్మడు అలరించింది.ఇక తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. 2004లో ‘తపన’ చిత్రంతో తెలుగు సినీ జగత్తులోకి ప్రవేశించిన అర్చన ‘నేను’ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. చివరిసారిగా ఆమె వజ్ర కవచధర గోవిందా చిత్రంలో నటించారు.

- Advertisement -