బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డి…హోస్ట్ గా వెంకటేశ్? 

148
Sri Reddy
తెలుగులో బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ 1, సీజన్ 2 లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్  వచ్చింది. త్వరలోనే సీజన్ 3 కూడా ప్రారంభం కానుంది…ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును చేస్తున్నారు షో నిర్వాహకులు.    ఇక సీజన్ 3కి యాంకర్ ఎవరన్నదానిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. నాగార్జున, వెంకటేశ్ ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు బిగ్ బాస్ 3కి హెస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ 3లో పార్టీసిపెంట్స్  ను వెతికే పనిలో ఉన్నారు నిర్వాహకులు. ఇప్పటికే కొంతమంది పేర్లు ఫైనల్ కాగా లీక్ కానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 3లో నటి శ్రీరెడ్డిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే శ్రీరెడ్డిని తీసుకుంది తెలుగు బిగ్ బాస్ లో కాదంటా..తమిళ్ లో ఆమెను కంటెస్టెంట్ గా తీసుకున్నారట. తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ తో వివాదం సృష్టించిన శ్రీరెడ్డి..తమిళ్ లో    కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంపై స్పందిస్తోంది. ప్రత్యర్థులపై మాటలతోనే విరుచుకుపడే శ్రీ రెడ్డి…  షో ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. తమిళ్ లో రెండు సీజన్ లకు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తెలుగులో హోస్ట్ గా వెంకటేశ్ చేయనున్నట్లు శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలిపింది.