మెగా బ్రదర్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిన శివాజీరాజా..

250
Actor Sivaji Raja
- Advertisement -

‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్‌కు మద్దతిచ్చి తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుపై ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగబాబు తనకు ఎన్నో ఏళ్లుగా మిత్రుడని చెబుతూనే.. ఆయన తనకు గిఫ్ట్ ఇచ్చారని, త్వరలోనే ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ప్రకటించి శివాజీరాజా సంచలనం సృష్టించారు. అయితే మెగా బ్రదర్ అయిన నాగబాబును ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని శివాజీరాజా ఏం చేయగలరని చాలామంది లైట్ తీసుకున్నారు. ఓటమి బాధలో శివాజీరాజా అలా మాట్లాడి ఉంటారని అనుకున్నారు. అయితే ప్రస్తుతం శివాజీరాజా నాగబాబు కు నిజంగానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

నాగబాబుకి ఒటేయకండి అంటూ శివాజీరాజా మీడియా సమక్షంగా చెప్పేసాడు .. చిరంజీవి , పవన్ కళ్యాణ్ గురించి మంచిగానే మాట్లాడుతూ.. మెగా బ్రదర్ నాగబాబు పై నటుడు శివాజీరాజా ఫైర్ అయ్యారు .. రాజకీయాల్లోకి వచ్చి జనాలకు సహాయం చేయాలి అనుకునే నువ్వు ఇంతవరకు నర్సాపురంకి ఎం చేసావ్ ? కనీసం నర్సాపురం బార్డర్స్ అయిన తెలుసా నీకు అని ప్రశ్నిచారు .. ఆరు వందల మంది ఉన్నా “మా అసోసియేషన్” కి ఎం చేయలేని వాడివి నిన్ను ఎంపిగా గెలిపిస్తే ప్రజలకు ఎం చేస్తావని ఎద్దావా చేసారు.. మా తాతలు, ముత్తాతలు భీమవరంలోనే పుట్టారు. నేనూ అక్కడే పుట్టాను ఆ ఊరి వ్యక్తిగా దీనిపైన చెప్పే భాధ్యత తన వంతుగా ఉందని ఆయన అన్నారు.. ఊరిని నాగబాబు నుంచి రక్షించుకోవడం కోసం మంచి వ్యక్తికి ఓటేయాలని, నాగబాబు లాంటి వ్యక్తికి ఓటు వేసి నష్టపోకండని చెబుతున్నాను అని శివాజీరాజా అనడం చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవి , పవన్ కళ్యాణ్ ట్యాగ్ తగిలించుకొని సడన్ గా రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబును నమ్మవద్దునని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.. ఎవరు మనకి అందుబాటులో ఉంటారో , ఎవరు మంచి చేస్తారో ఆలోచించుకొని ఓటు వేయాలని లేకపోతే మన ఓటు మురికి కాలువలోకి వెళ్ళిపోతుందని అన్నారు .. కులాల గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అన్ని కులాల వారు ఊరు చివరి వరకు తరిమి కొడతారని నాగబాబుకి హితవు పలికారు.. మరి నాగబాబు ఇచ్చిన గిఫ్ట్ ఫలించినట్లుగా శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -