గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన జార్జిరెడ్డి హీరో

488
Sandeep Madhav
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సింగర్ మంగ్లీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు జార్జిరెడ్డి మూవీ హీరో సందీప్ మాధవ్. మూసాపేట్ డివిజన్ పీఆర్ నగర్ పార్క్ లో మూడు మొక్కలు నాటాడు సందీప్ మాధవ్. ఈ సందర్భంగా సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. పర్యవరణాన్ని కాపాడేందుకు అందరూ మొక్కలు నాటాలని పిలపునిచ్చాడు.

Sandeep Madhav Green challeange

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్నతలు తెలిపారు. ఎంపీ సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దానిలో నేను కూడా భాగస్వామి అయి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో సంతోష్ కుమార్ ఏ కార్యక్రమం చేపట్టినా నేను తోడుగా ఉంటానని తెలిపారు. చేయి చేయి కలిపి ముందుకు పోతే ఏ కార్యక్రమం అయిన విజయవంతం అవుతుందన్నారు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కూడా అదే విధంగా ముందుకు సాగుతోందని అని రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహా నగరం గ్రీన్ నగరంగా మారాలని కోరారు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో నలుగురికి మొక్కలు నాటాల్సిందిగా కోరారు హీరో సందీప్‌. డైరెక్టర్ జీవన్ రెడ్డి, హిరోయిన్ నయన గంగూలీ, నటుడు శత్రువు,హిరోయిన్ కుంప్ చాందిని లకు మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -