3 గంటల్లోనే ముగిసిన విచారణ

224
actor-nandu-appears-before-sit
- Advertisement -

డ్రగ్స్ వ్యవహారంలో తొలి విడుత విచారణ చివరిదశకు వచ్చింది. నోటీసులందిన వారిలో 12వ వ్యక్తిగా సినీ నటుడు నందు విచారణ విచారణ ముగిసింది. దీంతో సిట్ నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ నటుల విచారణ పూర్తైంది. కెల్విన్ ఫోన్ డాటాలో నందు ఫోన్ నెంబర్ ఉండడంతో ఆదిశగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని సిట్ అధికారులకు చెప్పిన నందును కేవలం 3 గంటలపాటే సాగింది. సిట్ విచారణ ఎదుర్కొన్న వారిలో నందు మాత్రమే అత్యంత తక్కువ సమయం విచారణ ఎదర్కొన్న వ్యక్తిగా నిలిచారు.

నందు ఎంత స్వేచ్ఛగా విచారణకు వచ్చాడో, అంతే స్వేచ్ఛగా విచారణ నుంచి వెళ్లిపోయాడు. విచారణకు ముందు, తరువాత ఎలాంటి ఒత్తిడికి గురికాకపోవడం విశేషం. పది గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్న నందు.. సిట్ కార్యాలయం ముందున్న గుడిలో పూజలు నిర్వహించాడు. అనంతరం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. కాగా, 12 మంది సినీ నటుల విచారణలో సేకరించిన వివరాలతో సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. కెల్విన్, జిషాన్ తదితర డ్రగ్ సరఫరాదారుల కేసులో సిట్ విచారణ ఛార్జిషీటు కోసం సినీ నటులతో పాటు 27 మందిని విచారించినట్టు తెలుస్తోంది.

నిన్న సిట్ విచారణకు హాజరైన హీరో్ తనీష్.. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు. డ్రగ్స్ రాకెట్‌తో ఎలాంటి సంబంధాలున్నాయంటూ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో తనీశ్‌ ఉక్కిరిబిక్కిరయ్యాడని తెలిసింది. తన కెరీర్‌ను పాడుచేయవద్దని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. పరిశ్రమలో డ్రగ్స్ వాడేవారు, గుడ్‌విల్ కింద పెద్దవాళ్లకు సరఫరా చేసే వాళ్లు కూడా ఉన్నారు. చిన్నవాళ్లం.. మమ్మల్ని వదిలేయండి సార్.. అని వేడుకున్నట్టు తెలిసింది. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నా. డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. అసలు డ్రగ్స్ వాడను. పబ్బులు, క్లబ్బులకు వెళ్లను. ప్రస్తుతం సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నా. సంతోషమో, దుఃఖమో కలిగినప్పుడు వాటిని స్నేహితులతో పంచుకునే సమయంలో సిగరెట్, మద్యం తాగేవాడినని, కొన్ని సందర్భాల్లో గంజాయిని కూడా సిగరెట్లలో కలిపి వాడేవాళ్లమని చెప్పినట్టు తెలిసింది. మంచి హిట్‌కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడం భరించలేకున్నా అంటూ తనీశ్ కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.

- Advertisement -