మొక్కలు నాటిన సినీ నటుడు అభినవ్ సర్ధార్

652
Abhinav
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించారు సినీ నటులు అభినవ్ సర్ధార్. తన వ్యవసాయ క్షేత్రంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం తన స్నేహితులు మరో నలుగురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.

Abhinav Green

వాసుదేవరావు , శ్రీధర్ రావు, రవీంద్ర తేజ ,ఆంటోనీ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లను మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు, మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో తాను కూడా భాగమయ్యినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -