ఎబిసిడి ట్విట్టర్ రివ్యూ..

90
abcd review

ఓ వైపు మహర్షి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూంటే మరోవైపు థియేటర్లలో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకువచ్చాడు అల్లు శిరీష్‌. టిజర్‌,ట్రైలర్స్‌తో సినిమాపై అంచనాలను పెంచిన శిరీష్‌..ఏబిసిడితో హిట్ కొట్టాడా లేదా చూద్దాం.

ట్రైలర్‌తో సినిమా కామెడీ నేపథ్యంలో తెరకెక్కిందని అర్ధమవగా ఫస్ట్ షో చూసిన అభిమానుల నుండి మిక్స్‌ డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ఫస్టాఫ్ బాగుందని,సెకండాఫ్‌ పర్వాలేదని ట్వీట్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఎబిసిడి ఒరిజినల్ వర్షన్ స్ధాయిలో లేదని చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు అసలు కథలోకే వెళ్లలేదని, కొన్ని సన్నివేశాలు చూస్తున్నపుడు నిద్ర వచ్చే విధంగా ఉన్నాయని ట్వీట్ చేస్తున్నారు. భరత్ అనే పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచిందని, కొన్ని కామెడీ సీన్స్ బావున్నాయని చెబుతున్నారు. మరికొంతమంది స్క్రీన్ ప్లే స్లోగా ఉందని తెలిపారు. రాజీవ్ రెడ్డి దర్శకత్వం వహించగా మధుర శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కింది. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లోన్ హీరోయిన్‌గా నటించగా మెగా బ్రదర్ నాగబాబు కీ రోల్ పోషించారు.