రివ్యూ:ఏబీసీడీ

534
abcd review
- Advertisement -

అల్లు అరవింద్ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో అల్లు శిరీష్‌. గౌరవంతో టాలీవుడ్ ఎంట్రీకి ఇచ్చిన శిరీష్ చివరగా ఒక్కక్షణం మూవీతో అలరించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఎబిసిడిగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. మలయాళ రిమేక్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఏబీసీడీతో శిరీష్ మెప్పించాడా లేదా చూద్దాం..

కథ:

తెలుగువాడైన విద్యాపస్రాద్(నాగబాబు) అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడతాడు. ప్రసాద్ ఏకైక కొడుకు అరవింద్(అల్లు శిరీష్). చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టిపెరిగి జల్సాలకు రిచ్ కల్చర్‌కు అలవాటు పడతాడు. దీంతో అరవింద్ ప్రవర్తనతో విసుగుచెందిన నాగబాబు..కొడుక్కి డబ్బు విలువతెలిసేలా చేయాలనుకుంటాడు. ఇందుకోసం ఇండియాకు పంపుతాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అరవింద్‌కి అర్దమవుతుంది ఇది ఎంజాయ్ టూర్ కాదని. కానీ చేసేదేమీ లేక పరిస్థితులకు అలవాటుపడిపోతాడు. ఈ క్రమంలో నెలకు 5 వేలతో ఎలా నెట్టుకొస్తాడు..??స్నేహితుడు బాషా(భరత్‌)తో బస్తీ జీవితాన్ని ఎలాగడిపాడు.?అరవింద్‌ లవ్‌లో ఎలా పడతాడు..?చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందనేది తెరమీద చూడాల్సిందే.

Image result for abcd review

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ కామెడీ. అల్లు శిరీష్ ఎప్పటిలానే హుషారుగా నటించారు. అమెరికన్ బోర్న్ కుర్రాడిలా చక్కగా సరిపోయారు. హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్‌ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో బాగానే నటించింది.బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల్ని కబుపుబ్బా నవ్వించిన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. నాగబాబు, వెన్నెల కిషోర్, రాజా, శుభలేక సుధాకర్, కోట శ్రీనివాసరావు తదితరులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ, క‌థ‌నం. మరింత కామెడీ, ఎమోషన్స్‌ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశారు. కథలో బలమైన సంఘర్షణ లేకపోవడం పెద్ద మైనస్.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. రామ్ సినిమాటోగ్రఫీ, జుదా సాందీ సంగీతం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ద‌ర్శకుడు ర‌చ‌న ప‌రంగా అక్కడక్కడా పర్వాలేద‌నిపించాడు. సినిమా స్థాయికి త‌గ్గట్టే నిర్మాణ విలువ‌లు ఉన్నాయి.

తీర్పు:

కష్టం, డబ్బు, జీవితం విలువేంటో తెలుసుకోమని బిలియనీర్లు తమ కొడుకుల్ని సామాన్యుల మధ్యకి పంపిన సంఘటనలు గతంలో మనం చూశాం. దీనిని బేస్‌ చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. కామెడీ,అల్లు శిరీష్ నటన సినిమాకు ప్లస్ కాగా ఊహకు తగ్గట్టుగా సాగే కథ,కథనం మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ ఏబీసీడీ.

విడుదల తేదీ:17/05/2019
రేటింగ్:2.5/5
నటీనటులు: అల్లు శిరీష్‌, రుక్సార్ ధిల్లన్‌
సంగీతం: జుదా సాందీ
నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని
దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి

- Advertisement -