అన్ని కులాల‌కు హైద‌రాబాద్ లో ఆత్మ‌గౌర‌వ భ‌వ‌న్‌లు

208
cm kcr bc communities
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అన్ని కులాల వారు ఆత్మగౌరవంతో సగౌరవంగా భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రులు ఈటెల రాజేందర్‌, జోగు రామన్న, జగదీష్‌ రెడ్డి, చందులాల్, ఇంద్రకరణ్‌ రెడ్డి, తదితరులతో జరిపిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని కులాల భవనాల నిర్మాణం కోసం కోకాపేట్‌, ఘట్‌ కేసర్‌, మేడిపల్లి, మేడ్చల్‌, అబ్దుల్లాపూర్‌, ఇంజాపూర్‌, ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

cm kcr bc communities

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉందని, రాష్ట్రంలోని బలహీన వర్గాలు సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక, పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహాకారాలు అందిస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో దాదాపు 36 సంచార కులాలకు 10 ఎకరాల స్థలంలో రూపాయలు 10 కోట్ల వ్యయంతో ఆత్మగౌరవ భవన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని, సంచార భవన్‌లో సంచార కులాల వారు తమ ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలోని బీసీ కులాలు, ఎస్సీలలో ఉన్న బుడగ జంగాలు, ఎస్సీలలో ఉన్న ఎరుకల సాంస్కృతిక వికాస కేంద్రంగా అది భాసిల్లుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

cm kcr bc communities

అన్ని కులాలకు ఆత్మగౌరవ భవన్‌ను నిర్మించడం ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో జరుగలేదని, తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికే కాకుండా సామాజిక వికాసానికి కూడా ఆదర్శంగా నిలుస్తోందని సీఎ కేసీఆర్‌ చెప్పారు. కాసానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కొన్ని కులాలకు స్థలాలు కేటాయిస్తూ, ఉత్తర్వులు జారీ చేశాం. మిగిలిన కులాలకు కూడా స్థలం, నిధులు కేటాయిస్తున్నాం. మున్నూరు కాపులకు 5 ఎకరాలు-5 కోట్లు, దూదేకుల కులానికి 3 ఎకరాలు-3 కోట్లు, గంగ పుత్రులకు 2 ఎకరాలు-2 కోట్లు, విశ్వకర్మలకు 2 ఎకరాలు-2 కోట్లు, నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీ వైష్ణవ, కటిక తదితర కులస్తులకు ఒక్కో ఎకరం, ఒక్కో కోటి రూపాయలు, బట్రాజులకు అర ఎకరం, అర కోటి రూపాయలు కేటాయిస్తున్నాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

- Advertisement -