ఆర్జీవీ వదిలిన “ఆగ్రహం” టీజర్..

88
RGV

ఎస్ ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకం పై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరోహీరోయిన్లుగా ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సందీప్ చెరుకూరి నిర్మాతగా రూపొందిన చిత్రం “ఆగ్రహం”ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను రాంగోపాల్ వర్మ ముంబైలో ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్,నిర్మాత చెరుకూరి సందీప్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి,సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

RGV

ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ.. ‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్ కధాంశమిది. ఈ చిత్రంలో 5ఫైట్స్ ఉంటాయి.’ఆఫీసర్, సర్కార్3 చిత్రలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’ అని అన్నారు.

చిత్ర నిర్మాత సందీప్ మాట్లాడుతూ.. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ అడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా తెరకేక్కించాము. జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.’అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఎస్. రామకృష్ణ, ఎడిటర్:జె. పి, ఆర్ ఆర్ :రవిశంకర్,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడారి మూర్తి, నిర్మాత,:చెరుకూరి సందీప్, దర్సకత్వం:ఆర్. ఎస్.సురేష్.