ఆది సాయికుమార్‌కి ‘జోడి’ కుదిరింది..

59
Aadi Saikumar

పండగల సందర్భంగా టాలీవుడ్‌లో కొత్త సినిమాల కోలాహాలం ఎక్కువగా ఉంటుంది. కొత్త చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్కులు.. టీజర్లు.. ట్రైలర్లు రిలీజ్ చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. నిజానికి అలాంటివాటికిది సరైన సమయం. ఉగాది పండగ తెలుగువారికి ఎంతో ప్రియమైనది కాబట్టి ఈ రోజు పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. యువ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘జోడి’ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ రోజే రిలీజ్ అయింది.

ఆది సాయి కుమార్, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా ‘జోడి’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను నిన్న సాయంత్రం విడుదల చేయగా, ఈరోజు ఉగాది పండగను పురస్కరించుకుని కాసేపటిక్రితం ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని వదిలారు. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సాయి వెంకటేశ్ గుర్రం, పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.