అమల న్యూడ్‌ షో..వర్మ,సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

402
rgv aadai teaser

ఇద్దరమ్మాయిలు, నాయక్, జెండాపై కపిరాజు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బ్యూటీ అమలాపాల్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంతో తెరకెక్కుతున్న ఆమె సినిమాలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదలైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది అమలా పాల్.

టీజర్‌కు ఫిదా అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమె నగ్నత్వంలో నిజాయితీ నా హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు. అమలాపాల్‌పై ట్విట్టర్‌ ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్టు సమంత ట్విట్టర్‌లో పేర్కొంది.

టీజర్‌లో తన కూతురు కనిపించడం లేదని ఒక తల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేయడం.. పోలీసులు ఎంక్వైరీలో చివరిగా ఆమె ఫోన్ మాట్లాడినప్పుడు తాగి ఉందని తెలుసుకోవడం.. మిస్ అయిన అమ్మాయిని వెదకడం, చివరిగా ఒక ఆమె పనిచేస్తున్న ఆఫీస్‌లో నగ్నంగా రక్తపు మడుగులో ప్రాణాలతో పడి ఉండటంతో టీజర్ ఎండ్ చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందా? ఎవరు చేశారు? లాంటి ఆసక్తికర థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆమె టీజర్‌ బోల్డ్ అండ్ థ్రిల్లర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ టీజర్‌ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.