పిక్ ఆఫ్ ది వీక్:రూలర్‌ బాలయ్య

757
balakrishna
- Advertisement -

కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో బాలకృష్ణ యంగ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా తాజాగా మరో పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.‘గోల్ఫ్’ స్టిక్‌తో ఉన్న బాలయ్య లుక్‌ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం డిసెంబ‌ర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎలా మరాడన్న కధ సారాంశంగా సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీ సొంతం చేసుకుంది.

బాలకృష్ణ సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ‘జైసింహా’ తర్వాత బాలయ్య-రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -