వరంగల్ లో దారుణం..ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు

395
warangal
- Advertisement -

వరంగల్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. హన్మకొండలోని రామ్ నగర్ లో ఓ ప్రెమోన్మాది ప్రియురాలి గొంతుకోసి హత్యచేశాడు. హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బాధితురాలిని భారతిగా గుర్తించారు. ఆమె ఘటన స్ధలంలోనే చనిపోయింది. మరోవైపు ప్రెమోన్మాది షాషిద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు నిందితుడు షాషిద్ ను అడిగి తెలుసుకుంటున్నారు. భారతిని కలుద్దాం చెప్పి అని ఒక రూంలోకి తీసుకువచ్చి కాసేపు మాట్లాడి ఆ తర్వాత గొంతు కోసినట్లు చెబుతున్నారు పోలీసులు. నిందితుడు షాషిద్ చైతన్యపురి కాలనీలోని మటన్ షాపులో పనిచేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -