73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ..!

409
Old Woman Pregnant
- Advertisement -

73 ఏళ్ల వయసులో ఓ వృద్దురాలు గర్భం దాల్చింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడిలో చోటు చేసుకుంది. నెలపర్తిపూడి గ్రామానికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. ఈ దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

Old Woman Pregnant

దాంతో 2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్‌ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్‌ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్‌ మెడిసిన్‌ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్‌ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

గురువారం ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు ఆపరేషన్‌చేసి పురుడుపోయనున్నట్లు డాక్టర్‌ ఉమాశంకర్‌ చెప్పారు. గతంలో 70 ఏళ్లకు ప్రసవం ప్రపంచ రికార్డుగా ఉంది. కాగా ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ప్రసవం ద్వారా అరుదైన రికార్డు నెలకొంది.

- Advertisement -