శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీంలో విచారణ

229
sabarimala

శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

విస్తృత ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేతో పాటు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎం ఎం శాంతనగౌదర్, జస్టిస్ ఎస్ ఏ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. శబరిమల, మసీదు, పార్శి ఆలయల్లోకి మహిళల ప్రవేశంపై విచారణ చేపట్టనుంది ధర్మాసనం.