సావిత్రికి బిగ్ బాస్ షాక్‌..!

181
shiva jyothi

తెలుగు ‘బిగ్‌బాస్‌ 3’లో గత వారం నానా రచ్చ చేసిన తమన్నా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో హౌస్ లో 13 మంది సభ్యులు మిగిలారు. ఇక ఈ 13 మందికి సంబంధించి సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఊహించని విధంగా నామినేషన్స్ జరిగాయి. గత వారం ఓ టాస్క్ లో భాగంగా నిధి ఉన్న బాక్స్ ని బద్దలుగొట్టినప్పుడు రవి చేతికి గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయానికి పరోక్షంగా కారణమైన శ్రీముఖిని ఈ వారం డైరెక్ట్ గా నామినేట్ చేశారు.

అయితే ఈ వారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్‌ చేసే విధానం కాస్త విభిన్నంగా సాగింది. ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులను పిలిచి నామినేషన్‌ పక్రియ జరిపారు. ఇద్దరిలో ఎవరు సేవ్‌ అవుతారో, ఎవరు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతారో వాళ్లే చర్చించుకొని బిగ్‌బాస్‌కు చెప్పాలి. పునర్నవి, అలీ రెజాలకు ఇమ్యూనిటీ లభించిన కారణంగా వారిద్దరు నామినేషన్‌కు వెళ్లలేదు.

big boss 3

మిగిలిన వారిలో మొదటగా వితిక, రవిలు వెళ్లి ఎలిమినేషన్‌పై చర్చించుకున్నారు. టాస్క్‌ సమయంలో తాను తప్పు చేశాను కనుక ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతాను అంటూ రవి చెప్పాడు. వరుణ్‌, మహేష్‌లలో మహేష్‌ సేవ్‌ అవ్వగా వరుణ్‌ ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యాడు. అషూరెడ్డి, బాబా భాస్కర్‌లలో అషూ సేవ్‌ అవ్వగా బాబా భాస్కర్‌ ఎలిమినేషన్‌లో ఉన్నాడు. రాహుల్‌, హిమజలలో రాహుల్‌ ఎలిమినేషన్‌లో నిలిచాడు.

అయితే ఈ సారి నామినేషన్‌ ప్రక్రియలో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నేరుగా నామినేట్ చేసాడు బిగ్ బాస్. వాళ్లే శివజ్యోతి, రోహిణి. సాధారణంగా నామినేషన్స్ జరుగుతున్న సమయంలో మాట్లాడకూడదని రూల్ ఉంటుంది ఇంట్లో. అప్పటికే తమ నామినేషన్ పూర్తి చేసుకుని వచ్చారు శివజ్యోతి, రోహిణి. అందులో రోహిణి తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది.

Shiva-Jyothi

ఇక శివజ్యోతి సేఫ్ అయింది. కానీ బయటికి వచ్చిన తర్వాత ఇద్దరూ గుసగుసలాడుకోవడంతో అసలు రచ్చ మొదలైంది. బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఈ వారంతో పాటు వచ్చే వారానికి కూడా నామినేట్ చేసాడు. దాంతో ఇద్దరూ చేసిన తప్పుకు బాధ పడుతూ కూర్చున్నారు. అక్కడ నామినేషన్స్ జరుగుతున్నపుడు మాట్లాడకూడదని తెలిసినా కూడా మాట్లాడి తప్పు చేసారు.