మానస సరోవర్‌లో చిక్కుకున్న 40 మంది తెలుగు వారు..

83
40 Hyderabad pilgrims

హైదరాబాద్‌ చెందిన సుమారు 40 మంది మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్నట్లు సమాచారం. చైనా-నేపాల్‌ సరిహద్దు ప్రాంతమైన మానస సరోవర్‌కు ఈనెల 13న వీరంతా వెళ్లారు. యాత్రికులు గత ఐదు రోజులుగా అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. రక్షించాలంటూ వారు తమ కుటుంబ సభ్యులకు వీడియోలు పంపించారు. తమలో కొంతమంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.

అక్కడ అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిన ట్రావెల్స్…ఆ తర్వాత చేతెలెత్తేసిందని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఎలాగైనా తమను ఇక్కడి నుంచి స్వస్థాలకు పంపించాలని కోరుతున్నారు యాత్రికులు.