ఈ సినిమా చూడాలంటే… ఇంకో వందేళ్లు బతకాల్సిందే

326
nature
- Advertisement -

100 ఏళ్ల తరువాత ఈ భూమి ఎలా ఉంటుంది. మనుషులు ఎలా ఉంటారు. అపుడు వాళ్లేం తింటారు. అసలు వాళ్లు భూమిమీదే ఉంటారా.. అసలు చెట్లు.. అడవులు.. ప్రకృతి ఉంటుందా.. వీటన్నింటికి సమాధానం.. ఒకే సినిమా ‘100 ఇయర్స్‌: ద మూవీ యు విల్‌ నెవర్ సీ’. వందేళ్లు:మీరు అస్సలు చూడలేరు అని దీనర్థం. అయితే ఈ సినిమాను నిజంగానే చూడలేం. బహుశా మన ముని మనవళ్లు చూస్తారని చెప్పొచ్చు. భూమి పుట్టినప్పటీ నుండి రానీ మార్పులు గత 20 ఏళ్లలో చూశాం. మరీ 100 ఏళ్ల తరువాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించిన హాలీవుడ్‌ దర్శకుడు రాబర్ట్‌ రోడ్రిగే ఊహాలు నిజమేనా తెలయాలంటే ఇంకో వందేళ్లు ఆగాల్సిందే.. ఎందుకంటే ఈ చిత్రాన్ని 18 న‌వంబ‌ర్ 2115 లో విడుద‌ల చేస్తారట‌.

image_vignette_scenario1

రచయిత జాన్‌ మాల్కొవిచ్‌ ఈ సినిమాకి కథను అందించడంతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో సినిమా రిలీజ్ కాక‌ముందే ఆన్ లైన్ లో ద‌ర్శ‌న‌మిస్తుడ‌డంతో ఈ సినిమాని అంత‌కాలం కాపాడ‌డం కోసం ఈ సినిమా ప్రింట్ ను బుల్లెట్‌ ప్రూఫ్‌ లాకర్‌లో పెట్టి 18 నవంబర్‌ 2115 తేదీన మాత్రమే ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా లాకర్‌కు టైం సెట్‌ చేశారు. ఈ సినిమా దర్శకుడు రాబర్ట్‌కి 48 ఏళ్లు. రచయిత, నటుడు జాన్‌కు 62 ఏళ్లు వీళ్లు కూడా ఈ సినిమా చూడలేరు.

you will never see

వందేళ్ల తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ప్రీమియర్‌ షోకి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది అతిథులను ఆహ్వానించాలని లిఖితపూర్వకంగా తమ వారసులకు పేర్కొన్నారట. ప్రింటు భద్రపరచిన లాకర్‌లోనే ఆ ఉత్తరం ఉంటుందని సమాచారం. మామూలుగా ఏడాదికీ రెండేళ్లకీ సాంకేతికం గా చాలా మార్పొస్తోంది. మరి.. వందేళ్ల తర్వాత విడుదల కానున్న ఈ సినిమా టెక్నాలజీ పరంగా భవిష్యత్ తరాన్ని ఏ మేరకు అలరిస్తుంది? అనేది సమాధానం దొరకని ప్రశ్నే.

- Advertisement -