వెంకీమామ @ 33

557
venkatesh
- Advertisement -

క్లాస్ అయినా, మాస్ అయినా, ఏ పాత్ర చేసినా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి…ఆ పాత్ర‌కే వ‌న్నె తెచ్చే క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి త‌న పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నాడు. ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా చేయ‌గ‌ల‌డ‌ని మన్ననలు పొందిన వెంకీ…మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచాడు. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 33 సంవత్సరాలైంది.

డిసెంబర్ 13, 1960లో జన్మించిన వెంకటేష్‌…. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన వెంకీ…గత 33 సంవత్సరాలుగా టాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తున్నారు.

వెంకీకి బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,గురు మొదలైనవి. వెంకీ సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరిని వెంకటేష్ హీరోగా తెలుగులో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.

సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌ల‌సి న‌టించి మల్టీస్టార‌ర్ మూవీస్ కి నాంది ప‌లికారు. త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గోపాల గోపాల,ప్రస్తుతం నాగచైతన్యతో వెంకీ మామ చేస్తున్నారు. విభిన్న క‌థా చిత్రాల‌తో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ మరెన్నో హిట్స్ ప్రేక్షకులను అలరించాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -