అవన్నీ మెగా రూమర్లే:పృథ్వి

352
30 years prudhvi
- Advertisement -

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు పృథ్వి. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పృథ్వి ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ముఖ్యంగా మెగా బ్రదర్ పవన్‌పై విమర్శలు సైతం గుప్పించారు.

దీంతో మెగా ప్యాన్స్‌ పృథ్విపై తీవ్ర కోపంతో ఉన్నారు. పృథ్వికి రిటర్న్ గిఫ్ట్‌ ఇవ్వడంలో భాగంగా మెగా హీరోల సినిమాల నుంచి పృథ్విని తొలగించారని వార్తలు వెలువడుతున్నాయి.

గత మూడు నాలుగు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించారు పృథ్వి. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చేశారు. తనను ఎవరూ బ్యాన్ చేయలేదని..అసలు తనకు త్రివిక్రమ్, బన్నీ సినిమాలో ఆఫర్ రానేలేదని స్పష్టం చేశారు.

- Advertisement -