ఈసారి వరల్డ్ కప్ ఎవరూ గెలుచుకుంటారో చెప్పేసిన లారా

66
Lara

మరో వారం రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. నాలుగు ఏండ్లకు ఒకసారి జరిగే ఈ వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ పై సీనియర్ క్రికెటర్లు చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెస్టిండింస్ మాజీ ఆటగాడు లారా స్పందించారు. వరల్డ్ కప్ లో ఈసారి ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఇండియా టీంలో సరైన బౌలర్లు, బ్యాట్స్ మెన్లు ఉన్నారని చెప్పారు.

అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల ఆటగాళ్లు జట్టులో ఉన్నందున టైటిల్ గెలుచుకోగలరని తెలిపాడు. భారత జట్టు విజేతగా అవతరిస్తే ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విభిన్న పరిస్థితుల్లో సైతం వారు చక్కగా రాణిస్తున్నారు. భారత జట్టు చాలా సమతూకంలో ఉంది. భారత్ బలమైన జట్టు అని చెప్పడంలో సందేహమే లేదని ఆశాభావం వ్యక్తం చేశారు.