శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

307
kavithaMOJO
- Advertisement -

శబరిమల ఆలయంలోకి తెలుగు జర్నలిస్ట్ కవిత ఎంట్రీ నరాలు తెగే ఉత్కంఠను తలపిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కవిత ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సనాతనవాదులు మాత్రం కవితను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రవేశానికి కూతవేటు దూరంలోనే కవిత ఉండటంతో.. ఆలయం దిశగా ఒక్క అడుగుపడ్డా ఆత్మహత్యలు చేసుకుంటామని సాంప్రదాయవాదులు హెచ్చరిస్తున్నారు. అయితే కవిత ఎట్టిపరిస్థితుల్లోలైనా ఆలయంలోకి ప్రవేశిస్తానని గట్టిగా చెబుతోంది. ఆమెతో మరో యువతి కూడా ఆలయంలోకి వెళ్లేందుకు కవితో పాటు నడుస్తోంది. అయితే వీరిద్దరు పోలీసుల వీవీఐపీ భద్రత మధ్య నీలక్కల్, పంబను దాటి ఆలయం దిశగా సాగుతున్నారు.

sabari

రుతుస్రావం అయ్యే మహిళలకు శబరిమల కొండపైకి వెళ్లడం నిషేధమైనప్పటికీ.. గత నెలలో అన్ని వయసుల మహిళలు శబరిమలకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఒక వేళ వీరిద్దరూ కొండపైకి వెళ్తే.. చరిత్ర సృష్టించినట్టే. ఈ మహిళలిద్దరి వయసు పాతిక ఏళ్లు మాత్రమే. హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీలో రిపోర్టర్‌గా పని చేస్తున్న కవిత ఇవాళ ఉదయం 100 మంది పోలీసుల సహాయంతో శబరిమల కొండ ఎక్కుతున్నారు. పంబ వద్ద మోజో టీమ్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. మహిళా జర్నలిస్టులు కొండపైకి అడుగుపెడితే తర్వాత జరిగే చర్యలకు పోలీసులే బాధ్యత వహించాలని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. మహిళా జర్నలిస్టుకు ఐజీ శ్రీజిత్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం రక్షణ కల్పిస్తోంది.

- Advertisement -