విజ‌య‌ద‌శ‌మికి `2 స్టేట్స్` ఫ‌స్ట్ లుక్‌

214
adavi shesh
- Advertisement -

అడవి శేష్‌, శివానీ రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఎంఎల్‌వి సత్యనారాయణ నిర్మాతగా వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `2 స్టేట్స్‌`.రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేస్తున్నారు.

two states

ఈ సంద‌ర్భంగా.. నిర్మాత ఎం.ఎల్‌.వి స‌త్య‌నారాయ‌ణ‌ మాట్లాడుతూ బ్యూటీఫుల్, క్యూట్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అడివిశేష్‌, శివాని పెయిర్ చ‌క్క‌గా ఉందని, సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నామన్నారు. ఇప్ప‌టికే నాలుగు షెడ్యూల్స్ పూర్త‌య్యాయని, కోల్‌క‌తాలో రెండు షెడ్యూల్స్‌, హైద‌రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశామని, డైరెక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డి సినిమాను ఆద్యంతం చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారని, విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నామని అన్నారు.

ద‌ర్శ‌కుడు వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ  ఈ నెల 22 నుండి హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఓ పెళ్లి పాటను జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం లో చిత్రీక‌రిస్తామని, త‌దుప‌రి విదేశాల్లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉందని, దీంతో టాకీ మొత్తం పూర్త‌వుతుందన్నారు. అడివి శేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, ర‌జ‌త్ క‌పూర్‌, భాగ్య‌శ్రీ, లిజి, ఆదిత్య మీన‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, హేమ‌, ఉత్తేజ్ త‌దితరులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -