ఢిల్లీలో పేక మేడలా కుప్పకూలిన భవనం..

349
building

ఢిల్లీ సోమవారం అర్ధరాత్రి నాలుగంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఢిల్లీ కే బ్లాక్ జేజే కాలనీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం అర్థరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు. శిధిలాల్లో చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికి తీశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానంతో గాలింపు కొనసాగిస్తున్నారు. మొదటి అంతస్తులో స్థానికులు ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు తెలిపారు.

delhi

అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భవనం కూలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతుల కుటుంబాల రోదనతో స్ధానికంగా విషాదం నెలకొంది.