చిట్టి ఫస్ట్ డే@ 70 కోట్లు

286
rajani 2.0
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.0 నిన్న(గురువారం) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. దాదాపు 10వేలకు పైగా థియేటర్లలో విడుదలైన 2.0 పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే ఏకంగా రూ. 70 కోట్లను రాబట్టి రికార్డులను తిరగరాసిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

2.0 హిందీ వర్షన్‌లో తొలిరోజు 23 కోట్లు రాబట్టగా ,తెలుగు రాష్ట్రాలు(ఏపీ,తెలంగాణ)….19 కోట్లు,కర్ణాటక.. 8.25 కోట్లు,ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్‌.. 5 కోట్లు,పంజాబ్ 2 కోట్లు,బీహార్ ..1.25 కోట్లు రాబట్టగా ఓవర్సీస్‌లోనూ సత్తాచాటింది.

  2.0 collections first day

ఇక ఓవర్‌సీస్‌ విషయానికొస్తే.. అమెరికాలో 295000 డాలర్లు(రూ.2,05,54,125). న్యూజిలాండ్‌లో 18 ప్రదేశాల్లో విడుదలైన ఈ చిత్రం 23,243 న్యూజిలాండ్‌ డాలర్లు (రూ.11.11 లక్షలు) రాబట్టింది. ఆస్ట్రేలియాలో 114,696 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.58.46 లక్షలు) రాబట్టింది. అక్కడ ఈ చిత్రం 35 ప్రదేశాల్లో విడుదలైంది.

అయితే బాహుబలి రికార్డులను మాత్రం చెరిపేయలేకపోయింది 2.0. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2..తొలిరోజు ఏకంగా 121 కోట్ల వసూళ్లను రాబట్టి భారతదేశ సినీ చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించింది.

- Advertisement -