సాహో ట్రైలర్‌కే 137 కట్స్‌: ప్రభాస్‌

696
prabhas sahoo
- Advertisement -

సాహో ట్రైలర్ కట్ చేయడానికి చాలా కష్టపడ్డామని…137 కట్స్ తరవాత ఫైనల్‌గా ట్రైలర్‌ను ఓకే చేశామని చెప్పారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. ఆగస్టు 30న సాహో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా చూసిన తరవాత ఈ ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో ప్రేక్షకులకు అర్థమవుతుందన్నారు. సినిమాలో ఒక సన్నివేశం ఐదారు సార్లు కనిపిస్తుందని, ఇది చాలా క్లిష్టమైన సన్నివేశమని తెలిపారు.

సాహో పూర్తిగా స్క్రీన్‌ప్లేపై ఆధారపడి నడిచే సినిమా అన్నారు. సినిమా వెళ్లే విధానం రకరకాలుగా ఉంటుందని…బాహుబలి కన్నా గొప్ప స్క్రిప్ట్‌ అన్నారు. ఒక మంచి స్క్రిప్ట్‌కి సుజీత్ స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుందని…దర్శకుడు మాత్రం ఆ ప్రెజర్ ఫీలవ్వలేదని ప్రభాస్ చెప్పారు. ఈ సినిమాకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారని వారందరిని సుజీత్ చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పారు. ఈ సమావేశంలో హీరోహీరోయిన్లు ప్రభాస్, శ్రద్ధా కపూర్, నిర్మాతలు వంశీ-ప్రమోద్ పాల్గొన్నారు.

- Advertisement -