గుడ్ న్యూస్… రాష్ట్రంలో 11మందికి క‌రోనా నెగిటివ్ఃమంత్రి కేటీఆర్

69
ktr

క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తుంది. ఇండియాలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1000 దాటింది. తాజాగా తెలంగాణ ప్రజ‌ల‌కు గుడ్ న్యూస్ తెలిపారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో గతంలో నమోదైన పదకొండు పాజిటివ్ కేసులకు సంబంధించి తాజాగా టెస్టులు నిర్వహించారని తెలిపారు. ఆ టెస్టుల్లో అన్ని కేసులు ‘నెగెటివ్’గా తేలాయని, ఈ విషయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటానంటూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.

కాగా, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఆ పదకొండు మందికి చికిత్స అందించారు. ‘కరోనా’ బారి నుంచి బయటపడ్డ వీరిని ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్టు సమాచారం.లాక్‌డౌన్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 మొబైల్‌ రైతు బజార్లను ప్రారంభించామని కేటీఆర్‌ తెలిపారు. వీటి ద్వారా పౌరులకు వారి ఇంటి వద్దకే వెళ్లి కూరగాయలను సరఫరా చేస్తున్నారని చెప్పారు.