బార్‌లో కాల్పులు.. 11 మంది మృతి..

197
gun attack at Brazil bar
- Advertisement -

బ్రెజిల్ లోని పారా రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోయారు. బెలెమ్ నగరంలోని ఓ బార్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరుగులు మహిళలు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన ఏడుగురిలో ఒకరిని బ్రెజిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ అల్లరిమూక బైక్ లు, కార్లపై బార్ వద్దకు చేరుకుందని తెలిపారు. అయితే కాల్పులు ఎందుకు జరిపారు? ఎవరూ జరిపారనే విషయాలపై స్పష్టత రావల్సివుందని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -