హైదరాబాద్‌లో ప్లాస్టిక్ రోడ్లు…

285
- Advertisement -

హైదరాబాద్‌ లో ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన రహదారుల మరమ్మతు పనులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌నుల కోసం రూ.20 కోట్లను ఖ‌ర్చు చేస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రోరైలు ఆధ్వ‌ర్యంలో ఈ ప‌నులు జ‌రుగుతున్నాయి. యూరోపియన్‌ నగరాల్లో వినియోగించే పవర్‌ బ్లాక్‌ను ఈ పనుల కోసం మెట్రో సంస్థ ఉప‌యోగిస్తోంది. హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతంలో ఈ తరహా రహదారులు ఇప్ప‌టికే ఉన్నాయి. అయితే, ప్ర‌స్తుతం ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో వీటిని హెచ్‌ఎంఆర్‌ చేపట్టింది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కి ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచి రోడ్లు పాడై క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌స్య మ‌ళ్లీ రాకుండా పవర్‌ బ్లాక్స్‌తో మరమ్మతులు కొన‌సాగిస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ప‌నుల‌ను ద‌గ్గ‌రుండి ప‌రిశీలిస్తున్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ది చేయడంలో భాగంగా నగరమంతా ప్లాస్టిక్ రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద రెండు నెలల కిందట నాగోల్ దగ్గర నిర్మించిన వంద మీటర్ల ప్లాస్టిక్ రహదారి సక్సెస్ అవడంతో నగరమంతా అలాంటి రోడ్లే వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

kk-plastic-roads-2

రోడ్ల దుస్థితిని మార్చాలని మంత్రి కేటీఆర్‌.. వివిధ నగరాల్లో రోడ్ల నిర్మాణంపై అధ్యయనం చేశారు. బెంగళూరులో వేసిన ప్లాస్టిక్ రోడ్ల ఐడియాను అడాప్ట్ చేసుకున్నారు. మన దగ్గర కూడా ప్లాస్టిక్ రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మన దేశంలో ప్లాస్టిక్‌ రోడ్లు వేసిన ప్రతి చోటా సక్సెస్ అయ్యాయి. 11 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్లాస్టిక్‌ రహదారులు ఉన్నాయి. తెలంగాణలో తొలిసారిగా జీహెచ్‌ఎంసీలో ప్లాస్టిక్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రెండు నెలల కిందట నాగోల్ బ్రిడ్జిపై ప్లాస్టిక్ రహదారి నిర్మించారు. 100 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేశారు. ఇందుకు సుమారు 11 లక్షల వరకు ఖర్చయింది. మొన్నటి భారీ వర్షాలకు మిగతా రోడ్లు దెబ్బతిన్నా.. నాగోల్ దగ్గర నిర్మించిన ప్లాస్టిక్ రోడ్డు, బంజారాహిల్స్ లో వేసిన వైట్ ట్యాపింగ్ రోడ్డు మాత్రం చెక్కుచెదరలేదు.

white-topping-road

ప్లాస్టిక్ రోడ్లు ఏడెనిమిదేళ్ల వరకు ఎలాంటి రిపేర్లు అవసరం లేకుండా చెక్కుచెదరకుండా ఉంటాయి. త్వరలోనే నగరమంతా ప్లాస్టిక్ రోడ్లు దర్శనమివ్వనున్నాయి. హానికరమైన ప్లాస్టిక్‌ను రోడ్డు నిర్మాణంలో కలిపేయడం వల్ల పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ప్లాస్టిక్ను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తే.. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య చాలావరకు తగ్గే అవకాశముంది.

- Advertisement -