సీక్రెట్‌గా ఇలియానా పెళ్లి..?

416
ileana D'Cruz Andrew Kneebone marriage details
ileana D'Cruz Andrew Kneebone marriage details
- Advertisement -

అందాల భామ ఇలియానా పెళ్ళి గురించి తాజాగా బాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇలియానా, తన స్నేహితుడు ఆండ్రూతో చాలాకాలంగా సహజీవనం చేస్తోంది. సన్నిహితుల్ని పిలిచి, ఓ పెళ్ళి లాంటి తంతుని చాన్నాళ్ళ క్రితమే ఇలియానా పూర్తి చేసిందట కూడా. అయితే, ఇలియానా ఎందుకోగానీ ఈ పెళ్లి, సహజీవనం వంటి విషయాల్ని కామప్ చేసేసింది. బాయ్ఫ్రెండ్తో మాత్రం బాలీవుడ్ పార్టీల్లో ఇలియానా తెగ హల్చల్ చేసింది ఆ మధ్య.

 

ileana D'Cruz Andrew Kneebone marriage details

ileana D'Cruz Andrew Kneebone marriage details

అయితే మొన్నామధ్యన ఇల్లీ సడన్ గా ఎందుకు వెకేషన్ కు వెళ్ళింది.. ఎందుకు బికినీల్లో ఫోజులు ఇచ్చింది అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. ఇదే విషయం మొన్న జరిగిన ”రుస్తుం” సక్సెస్ పార్టీలో ఎవరో మాట్లాడుకుంటుంటే.. ఆ టైమ్ లో అమ్మడు అక్కడికి హనీమూన్ కు వెళ్లిందిలే అన్నారట. అదేంటి హనీమూన్?? అంటే.. పాపకు ఆస్ర్టేలియాలో ఆండ్రూతో ఎప్పుడో సీక్రెట్ పెళ్ళయ్యిందిగా అనేశారట కొందరు సన్నిహితులు. కావాలంటూ చూస్కోండి అంటూ సెల్ ఫోన్లో వారు తీసిన వీడియో కూడా చూపించారట.

ileana D'Cruz Andrew Kneebone marriage details

 

ileana D'Cruz Andrew Kneebone marriage details

 

ఇలియానా తన పెళ్లికి కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ ను మాత్రమే పిలిచింది కాబట్టి.. ఈ సిడి ఇంకా బయటకు రాలేదు కాని.. లేకపోతే ఈపాటికి న్యూస్ మీడియాలో హెడ్ లైన్స్ లో ఉండేది అంటూ జనాలు జోకులు పేల్చుకున్నారట.బాలీవుడ్ లో సినిమాలేవి ఇక రావనుకున్న ఇలియానా పెళ్లికి సిద్ధమైందని, అయితే రుస్తుం హిట్తో తన పంథాను మార్చుకుని పెళ్లి వార్త బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

- Advertisement -