రికార్డుల వెనుక ఉన్న లెక్కలు..

495
janatha garage
janatha garage
- Advertisement -

సినిమా రిలీజై రోజులు గడుస్తున్నా..జనతా గ్యారేజ్ జోరు మాత్రం తగ్గడంలేదు. టాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా మూడోస్థానం నిలిచినా.. ఇప్పటికీ నిలకడగా వసూళ్లు రాబడుతోంది ఈ మూవీ. మూడోవారానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా 106 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్ర నుంచి 81 కోట్లు రాబట్టగా..ఒక్క కర్ణాటకలోనే 16 కోట్లు వసూలయ్యాయి. ఇక కేరళలో గ్యారేజ్ ప్రభావం చూపలేకపోయింది. అక్కడ ఇప్పటి వరకు కేవలం 4 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. బాహుబలి, శ్రీమంతుడు తరువాత 15 రోజుల్లో 120కోట్లు రాబట్టిన చిత్రంగా జనతా రికార్డు సాధించింది. దీంతో పవన్ అత్తారింటికి దారేది వసూళ్లను దాటేశాడు.

ఇక అటు అమెరికాలోనూ జనతా మంచి వసూళ్లను రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ అక్కడ 12 కోట్లకు పైచిలుకు వసూళ్లనే రాబట్టింది. ఫైనల్ గా అక్కడ జనతా 2 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరే సూచనలు కనిపిస్తున్నాయి. డివైడ్ టాక్ లోనూ రికార్డు కలెక్షన్లు రావడానికి కారణం.. జనతాకు పోటీగా మరో సినిమా లేకపోవడమేననే టాక్ వినిస్తోంది. లేకుంటే జనతా జోరు ఇంతలా ఉండేది కాదని విశ్లేషకుల మాట. ఇప్పటిదాకా మొత్తం షేర్ చూస్తే 80 కోట్లు అని తెలుస్తుంది. శ్రీమంతుడు 86 కోట్లు కలెక్ట్ చేసింది. మరి జూనియర్ ఆ టార్గెట్ దాటితే.. బాహుబలి తరువాతి స్థానంలో సెటిల్ అయినట్లే.

- Advertisement -