మోడీపై పోటీకి సై అంటున్న జవాన్..!

1287
jawan
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి నుండి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక సమాలోచనలు జరుపుతుండగా తాజాగా మోడీపై పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించారు మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్.

జవాన్లకు సరైన ఆహారం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తేజ్ బహదూర్ వారణాసి నుండి పోటీచేస్తున్నట్లు తెలిపారు. హర్యానా రాష్ట్రంలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్‌ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పగానే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెల్లడించారు.

ఎన్నికల్లో గెలవడం,ఓడటం ముఖ్యం కాదని భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు. జవాన్లకు మోడీ చేసింది శూన్యమని తెలిపారు. రాజ్ బహదూర్ ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -