మోడీని బాగా వాడుకుంటున్నారు..

492
- Advertisement -

అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో విస్తృత ప్రచారం చేసిన రిలయన్స్‌….మరింత ప్రచారం కల్పించేలా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని సైతం వాడుకుంటోంది. ఏకంగా న్యూస్ పేపర్స్‌కు ఫుల్ పేజ్ యాడ్స్‌ ఇచ్చి వినియోగదారులను పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే, ప్రధానమంత్రి ఫోటోను ఓ కంపెనీ తన ప్రచారానికి వాడుకోవటం ఎంతవరకు సమంజసమో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తేల్చనుంది.

ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలకు మోడీ పేరుతో రిలయన్స్ కంపెనీ పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చింది. మోడీ ఫోటోను ప్రముఖంగా ప్రచురిస్తు…రిలయన్స్ జియో 120 కోట్ల మంది భారతీయులకు అంకితమనే ట్యాగ్ లైన్‌ ఇచ్చింది. ప్రధాని మోడీ కలలు కన్న డిజిటల్ ఇండియాను రిలయన్స్ జియో నెరవేరుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జీవితం డిజిటల్ మయమవుతోందని, రానున్న 20 సంవత్సరాల్లో డిజిటల్ ఇండియా అని పిలుచుకుంటామని  ధీమా వ్యక్తం చేశారు.

Modi

డిజిటల్ ర్యాంకింగ్‌లో ఇండియా స్థానాన్ని జియో మెరుగుపరుస్తుందని…ఈ డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది ఆక్సిజన్ లాంటిదని తెలిపారు. రిలయన్స్ జియోని కేవలం వ్యాపార దృక్పథంతోనే ప్రారంభించలేదని, ప్రతీ భారతీయడికి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభిస్తున్నట్లు ప్రకటనల్లో పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు…ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ట్విట్టర్‌ వేదికగా మోడీని తూర్పారబట్టారు. ఆయ‌న‌ను మిస్ట‌ర్ రిల‌యెన్స్ అంటో సంభోదించారు. ప‌బ్లిగ్గా రిల‌యెన్స్ జియో స‌ర్వీసుల‌ను ప్రోత్స‌హిస్తున్నారంటూ విమర్శించారు. మొత్తానికి రిలయన్స్ జియోతో మార్కెట్లో సంచలనం సృష్టించిన అంబానీలు… ప్రచారానికి ప్రధాని ఫోటో వాడటం పెద్ద చర్చనీయాంశమైంది.

- Advertisement -